Thursday, January 23, 2025

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆమనగల్లు : ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు ఒక వరమని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల, వెల్దండ, కల్వకుర్తి మండలాలకు చెందిన పలువురు అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను సోమవారం నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అందజేశారు. కడ్తాలకు చెందిన కాళకు 2 లక్షలు, వెల్దండ చెదురువెల్లి ఆర్. ముత్యాలికి 16 వేలు, అనిల్‌కు 31 వేలు, కంటోనిపల్లికి చెందిన శ్రీరాములుకు 45 వేలు, టి.శ్రీనుకు 16 వేలు, కల్వకుర్తి జీడిపల్లికి చెందిన ఆర్.కళ్యాణికి 16 వేలు, నవీన్‌కుమార్‌కు 22 వేల చెక్కులను అందజేసినట్లు ఆయన తెలిపారు.

అనంతరం వెల్దండ, అజిలాపూర్ గ్రామాలకు చెందిన డిఎల్‌ఐ భూ నిర్వాసితులు కలిసి పరిహారం అందించాలని ఎమ్మెల్సీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడారు. భూ నిర్వాసితులకు త్వరలో నష్టపరిహారం అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల నాయకులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News