Wednesday, January 22, 2025

రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు రాజగోపాలచార్యులు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగ్యనగరంలోని జియాగూడలో ప్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలచార్యులు(55) కన్నుమూశారు. సోమవారం రాత్రి రాజగోపాల చార్యులు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. శతాధిక దేవాలయాల ప్రతిష్ఠాపక యజ్ఞాచార్యలుగా, దేవతామూర్తుల అలంకార భట్టర్‌గా ప్రసద్ధి చెందారు. భారత దేశంలోనే కాకుండా విదేశాలలో హిందూ దేవాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. బుధవారం పురానాపూల్ దహనవాటిలో అంతియ సంస్కారాలు జరుగుతాయని ఆయన సోదరులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News