Sunday, September 22, 2024

చిన్నారులకు చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ ఆపన్న హస్తం

- Advertisement -
- Advertisement -

హన్మకొండ : 11 మంది బాల కార్మికులకు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అక్కున చేర్చుకొని పని నుంచి విముక్తి కల్పించారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ఆర్థిక స్తోమత లేని కుటుంబాలకు చెందిన చెత్త ఏరుకునే 11 మంది బాల కార్మికులను గురుకులాల్లో చేర్పించారు. పెన్ను, పుస్తకం పట్టాల్సిన చేతులు చెత్తను ఏరవద్దని, బడిలో గడపాల్సిన బాల్యం చెత్త కుప్పల వద్దకు చేరవద్దని, ఆట పాటలతో ఆనందంగా గడవాల్సిన బాల్యం ఆగం కావొద్దన్నారు.

ఈ సందర్భంగా మంగళవారం బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో చీఫ్ విప్ దాన్యం వినయ్‌భాస్కర మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేజీ టూ పీజ ఉచిత విద్య తెలంగాణ అందుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న గురుకులాల్లో చదువు చెప్పించే ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు.

వీధి బాలలను గుర్తించి వారిని బడిలో చేర్పించడంలో సహకరించిన లక్ష్మీ అనే మహిళను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అభినందించారు. అనంతరం చిన్నారులకు పుస్తకాలు అందచేసిన అన్నదానం చేశారు. వారి తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు ప్రాముఖ్యతను వివరించి గురుకులాల్లో చేర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ శాఖ ఈడీ శ్రీనివాస్, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News