హైదరాబాద్ : అటవీ శాఖలో వివిధ హోదాల్లో 33 ఏళ్ల పాటు విధులు నిర్వహించిన సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారి స్వర్గం శ్రీనివాస్ పదవీ విరమణ పొందారు. శనివారం అరణ్యభవన్‌లో స్వర్గం శ్రీనివాస్‌ను పిసిసిఎఫ్, హెచ్‌ఓఓఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్ తో పాటు, ఇతర సీనియర్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయన సుదీర్ఘ సర్వీసులో తమకు ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన స్వర్గం శ్రీనివాస్ ఎం.ఎస్సీ పూర్తి చేసిన తర్వాత 1989లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు ఎంపిన అయ్యారు. అటవీ శాఖతో పాటు, డిప్యుటేషన్ పై వివిధ శాఖలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకుని పనిచేశారు. ప్రస్తుతం చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ తో పాటు అడ్మిన్, విజిలెన్స్ విభాగాలకు అధిపతిగా పిసిసిఎఫ్ హోదాలో పనిచేస్తూ శనివారం పదవీ విరమణ పొందారు. పిసిసిఎఫ్ ర్యాంకులో తెలంగాణ రాష్ట్రం నుంచి రిటైర్డ్ అవుతున్న తొలి వ్యక్తిగా స్వర్గం శ్రీనివాస్ గుర్తింపు పొందారు.
చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ స్వర్గం శ్రీనివాస్ పదవీ విరమణ
- Advertisement -
- Advertisement -
- Advertisement -