Monday, December 23, 2024

వృద్ధురాలిని చేరదీసినా చిక్కడపల్లి ఇన్స్‌స్పెక్టర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రోడ్డుపై తిరుగుతున్న ఓ వృద్ధురాలిని చిక్కడపల్లి ఇన్స్‌స్పెక్టర్ చేరదీశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది ఆర్‌టిసి క్రాస్ రోడ్స్ వద్ద తిరుగుతుండగా ఓ వృద్ధురాలు అక్కడ రోడ్డుపై తిరుగుతోంది. వృద్ధురాలు గమనించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకుని వెళ్లారు. ఈ విషయం స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సీతయ్య దృష్టికి తీసుకుని వెళ్లారు.

వెంటనే బయటికి వచ్చిన ఇన్స్‌స్పెక్టర్ వృద్ధురాలిని ఆప్యాంగా పలకరించారు. తన పక్కన కూర్చోబెట్టుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత భోజనం పెట్టించి ఆమె నుంచి వివరాలు తెలుసుకున్నారు, వృద్ధురాలి పేరు నరసమ్మ(70), కాగా కొత్తగూడెం అని ఇన్స్‌స్పెక్టర్‌కు చెప్పింది. ఫొటోలో ఉన్న వృద్ధురాలికి సంబంధించిన వారు ఉంటే వెంటనే చిక్కడపల్లి పోలీసుల మొబైల్ నంబర్లు 8712660160, 8712661246నంబర్లలో సంప్రదించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News