Monday, January 20, 2025

వెలుగులోకి వస్తున్న చికోటి ప్రవీణ్ బాగోతాలు

- Advertisement -
- Advertisement -

Chikoti Praveen Casino Case

హైదరాబాద్: చికోటి ప్రవీణ్ బాగోతాలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయి. ఏడు నెలల్లో 7 దేశాల్లో చికోటి క్యాసినో నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక, ఇండోనేషియా, నేపాల్, సింగపూర్, థాయ్‌లాండ్‌లలో క్యాసినోలలో ఇప్పటివరకు వెయ్యిమందికిపైగా విదేశాలకు తీసుకెళ్లి క్యాసినో ఆడించినట్లు ఈడీ గుర్తించింది. హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నట్లు వెల్లడించింది. ఇక్కడ నగదు ఇస్తే క్యాసినోలో కాయిన్స్ ను ప్రవీణ్ సమకూర్చుతున్నాడని తెలిపింది. ప్రముఖులకు కాల్ గర్ల్స్ తో ప్రవీణ్ అండ్ గ్యాంగ్ అథిథ్యం ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఇండోనేషియా, థాయిలాండ్ లోనూ లావాదేవీలు జరిగినట్లు సమాచారం. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్ అకౌంట్లలో భారీగా నగదు గుర్తించారు. అకౌంట్లలో నగదు లెక్కలు చెప్పాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లో 8 చోట్ల జరిపిన సోదాల్లో భారీగా నగదు గుర్తించారు. శ్రీలంకలో ఈనెల 8 నుంచి 17 వరకు 2 సార్లు క్యాసినో నిర్వహించిన ప్రవీణ్ పంటర్స్‌ను ఉదయం తీసుకెళ్లి సాయంత్రం హైదరాబాద్ తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News