హైదరాబాద్: హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చికోటి ప్రవీణ్ బుధవారం ఫిర్యాదు చేశాడు. తన పేరు మీద కొందరు ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నకిలీ ఖాతాలతో తన పేరుపై సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్ట్ లు చేస్తున్నారంటూ తెలిపాడు. ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తులను గుర్తించాలని పోలీసులను కోరినట్లు చీకోటి వెల్లడించాడు. ఫేక్ అకౌంట్ వల్ల తాను చాలా మానసిక ఒత్తిడికి గురతున్నానని పేర్కొన్నాడు. ఎపి సిఎం జగన్ తో తనకు పరిచయమే లేదని చెప్పాడు. దీని వెనుక ఎపి ప్రతిపక్ష నాయకులు చేస్తున్నట్లు అనిపిస్తోందన్నాడు. ఎపి ప్రతిపక్షం అంటే ఎవరో ప్రపంచమంతా తెలుసని చీకోటి తెలిపాడు. రాజకీయాలకు తనకు ముడిపెడుతున్నారని చెప్పాడు. నకిలీ ఖాతాల విషయంపై ఎపి పోలీసులకు రేపు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. చీకోటి ప్రవీణ్ మూడో రోజు మాధవరెడ్డితో పాటు ఈడీ విచారణకు హాజరయ్యాడు.
సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులకు చికోటి ప్రవీణ్ ఫిర్యాదు
- Advertisement -
- Advertisement -
- Advertisement -