Thursday, January 23, 2025

బిజెపిలో చేరిన చీకోటి ప్రవీణ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : తిరునాళ్లలో దారితప్పిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినట్టుగా ఉందని కాసినో వ్యవహారాలు.. తదితర అంశాలతో గుర్తింపు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్ అన్నారు. శనివారం బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు సమక్షంలో ఆయన బిజెపి తీర్థం పుచుకున్నారు. గత నెలలో చీకోటి ప్రవీణ్ బిజెపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. పార్టీ రాష్ట్ర నేతలు అభ్యంతరం తెలిపారు. ఆయన చేరిక అంశం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉంది.

పార్టీ అగ్ర నాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బిజెపిలో అతడికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి.. సభ్యత్వం అందించారు. ఈ సందర్భంగా చీకోటి ప్రవీణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరునాళ్లలో దారితప్పిన పిల్లవాడు తిరిగి తల్లి ఒడికి చేరినట్టుగా ఉందని పేర్కొన్నారు. కొన్నాళ్ల కిందటే బిజెపిలో చేరాల్సి ఉన్నప్పటికీ, కొంత సమాచార లోపం వల్ల చేరలేకపోయానని, ఇన్నాళ్లకు పార్టీలోకి రావడం సంతోషం కలిగిస్తోందని అన్నారు. బిజెపిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. కాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News