Saturday, December 21, 2024

బిజెపిలో చీకోటికి నిరాదరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న చీకోటి ప్రవీణ్ అనూహ్య పరిణామం ఎదురైంది. చివరి నిమిషంలో చేరికకు బ్రేక్ పడింది. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన చీకోటి ప్రవీణ్‌కు వింత అనుభవం ఎదురైంది. రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యనేతలు ఎవరూ లేకపోవడంతో తన చేరిక వాయిదా పడింది. ఇదిలా ఉండగా.. తన చేరికను అడ్డుకుంటున్నారని చీకోటి ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయ స్థాయి నేతలతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చీకోటి వెల్లడించారు. పార్టీపై అభిమానంతోనే వచ్చానని అన్నారు. సీనియర్ నేతలు అందుబాటులో లేకపోవడంతో చేరికకు వాయిదా పడిందని బిజెపి శ్రేణులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News