Sunday, December 22, 2024

యూపీలో ట్రక్కును ఢీకొన్న కారు…8 మంది సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

బరేలి : ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలిలో శనివారం రాత్రి నైనిటాల్ హైవేపై వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా కారులో మంటలు చెలరేగి ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు.. కారు డోర్లు సెంట్రల్ లాక్ అయి తెరుచుకోలేదు. దాంతో కారులో ప్రయాణిస్తున్న వారంతా బయటకు రాలేక పోయారు. మృతుల్లో ఏడుగురు పెద్దవాళ్లు, ఒక చిన్నారి ఉన్నారు.

వీరంతా ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారుతోపాటు ట్రక్కు కూడా పూర్తిగా దగ్ధమైంది. కారు అదుపు తప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టినట్టు బరేలీ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ సుశీల్ చంద్ర బాన్ ధులే తెలియజేశారు. ట్రక్కు డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News