హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విమానం, పుష్ప చైల్డ్ ఆర్టిస్ట్ ధృవన్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ధృవన్ మాట్లాడుతూ సంతోష్ అంకుల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కను నాటానని తెలిపారు. మొక్కలతో ఫ్రెండ్ షిప్ చేస్తే ఎంత బా ఉంటుందో మొక్కను నాటాకే తెలుస్తుందన్నారు. మనకు పచ్చదనం, మంచి గాలి కావాలంటే మొక్కలు కావాలన్నారు. సంతోష్ అంకుల్ మనం అందరం బాగా ఉండాలానే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారన్నారు. అందుకే మనం అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించు కోవాలని, అందరు సంతోష్ అంకుల్ చెప్పినట్టు మొక్కలు నాటాలని కోరుకుంటున్నానన్నారు.
‘ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలి’
తమ పెళ్లిరోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని చొప్పదండి ఎంఎల్‌ఎ సుంకే రవిశంకర్ పిఎ పుటుకం టాగూర్ సంతోషి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ పెళ్లిరోజు పురస్కరించుకొని ఎంపి సంతోష్ కుమార్ తలపెట్టిన గొప్ప కార్యక్రమం ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇందులో బాగంగా మొక్కలు నాటడం సంతో షంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలి కోరుకుంటు న్నాను. తమకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.