Wednesday, January 22, 2025

గర్భిణి పట్ల దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం

- Advertisement -
- Advertisement -

దుబ్బాక: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కంటే ప్రభుత్వ ఆసుపత్రిలోనే నాణ్యమైన వైద్యం లభిస్తుందని నమ్మి పురిటి నొప్పులతో ప్రసవం కోసం దుబ్బాక పట్టణంలోని వంద పడకల ఆసుపత్రికి వచ్చిన గర్భిణి పట్ల ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కడుపులోనే ఆడ శిశువు మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన నవనీతకు పురిటి నొప్పులు రావడంతో శనివారం నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాక పట్టణంలోని వంద పడకల ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు.

ఆసుపత్రిలో ఉదయం కేవలం ఇద్దరు స్టాఫ్ నర్సులు తప్ప వేరే ఇతర వైద్యులు లేకపోవడంతో అక్కడున్న స్టాఫ్ నర్సులు వచ్చిరాని వైద్యంతో రాత్రి సుమారు 11 గంటల సమయంలో నవనీత కు డెలివరీ చేయడంతో కడుపులోనే ఆడ శిశువు మరణించినట్లు నవనీత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వెంటనే ఇదేంటని వైద్య సిబ్బందిని ప్రశ్నించడంతో ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు లేరని మేమేం చేస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని అన్నారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది వచ్చిరాని వైద్యం చేయడం మూలంగానే శిశువు మృతి చెందడం జరిగిందని ఘటనకు బాధ్యులైన వైద్య సిబ్బందిని ఉద్యోగం నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని నవనీత కుటుంబీకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News