Thursday, January 9, 2025

అత్తాపూర్ లో విషాదం.. కారు చక్రాల కింద నలిగి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. అక్బర్ హిల్స్ కాలనీ సుల్తాన్ అపార్ట్మెంట్ సెల్లార్ లో కారు యాజమాని అయ్యాజ్ అహ్మద్ కారు పార్కింగ్ చేశాడు. కారు చక్రాల కింద ఉన్న పసిగందును గమనించకుండా కారు రివర్స్ తీసుకుంటూ ఉండగా కారు చక్రాల కింద చిన్నారి నలిగిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

చనిపోయిన చిన్నారి అదే అపార్ట్మెంట్ లో వాచ్ మెన్ గా శ్రీను కుమార్తె గా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అత్తాపూర్ పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కళ్లముందే చిన్నారి కారు చక్రాల క్రింద నలిగి చనిపోయి పడి ఉండడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News