Sunday, December 22, 2024

సికింద్రాబాద్ లో నాలాలో పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

సికింద్రాబాద్: నాలాలో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన సికింద్రాబాద్ పరిధిలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం సికింద్రాబాద్ లోని కళాసిగూడ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో చిన్నారి పడి మృతి చెందింది. నాలా పుట్ పాత్ పైకప్పు నుంచి పడి మౌనిక(6) చిన్నారి మృతి చెందింది.ఇవాళ ఉదయం 5 గంటల నుంచి ఎడతెరపిలేకుండా కురుస్తోంది వాన. దీంతో… రోడ్లపైకి వర్షపునీరు చేరింది.

Also Read: విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్

దీంతో నాలా పై భాగంలో రంధ్రం పడింది. అది గమనించని చిన్నారి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా రంధ్రంలోంచి నాలాలో పడింది. దీంతో చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. కిరాణ షాపు కి వెళ్తుండగా ఈ దుర్షఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News