Thursday, January 23, 2025

పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రెండేళ్ల పాప పాఠశాల బస్సు కిందపడి మృతిచెందిన సంఘటన హబ్సిగూడలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…హబ్సీగూడ రవీంద్రనగర్‌కు చెందిన మిథున్‌కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గురువారం ఉదయం తన కుమారుడిని మిథున్‌ను పాఠశాల బస్సు ఎక్కించడానికి వచ్చాడు. ఈ క్రమంలో మిథున్ కుమకార్తె జావ్లానా(2) తన తండ్రి, అమ్మమ్మతో కలిసి బస్సు వద్దకు వచ్చింది. పాఠశాల బస్సు డ్రైవర్‌తో మిథున్ మాట్లాడుతుండగా అమ్మమ్మతో ఉన్న చిన్నారి జావ్లానా నాన్న వెద్దకు వెళ్తానంటూ పరిగెత్తి వెళ్లింది.

ఈ సమయంలోనే డ్రైవర్ బస్సును ముందుకు తీయడంతో టైరు కిందపడి బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్షం వల్లే తమ పాప మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News