Tuesday, April 1, 2025

విద్యుదాఘాతంతో చిన్నారితోపాటు ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

విద్యుదాఘాతంతో చిన్నారితోపాటు ఇద్దరు మృతిచెందిన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాషా కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…పుప్పాలగూడ, పాషా కాలనీలోని ఓ ఇండిపెండెంట్ ఇంటిలో ఉస్మాన్ అనే వ్యక్తి కిరాణా షాపు నిర్వహిస్తుండగా పై అంతస్థుల్లో కుటుంబం ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం కిరాణా షాపులో షార్ట్‌సర్కూట్ రావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో అంటుకున్న మంటలు పై ఫ్లోర్లకు చేరుకోవడంతో ఇంట్లో ఉన్న మూడు సిలిండర్లు పేలడంతో మంటలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఊపిరాడక సిజిరా ఖటూన్(7), జమీలా ఖాటూన్(70), సహానా ఖాటూన్(4౦) మృతిచెందారు.

మిగతా ఐదుగురిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. మంటలను చూసి ఇద్దరు చిన్నారులు బిల్డింగ్ పై నుంచి కిందకి దూకడంతో గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అగ్నిప్రమాదం జరగగానే స్థానికులు అగ్నిమాపక సిబ్బందిక సమాచారం అందించారు. ఫైర్ ఇంజిన్ వచ్చేలోపు స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చిన తర్వాత మంటలను ఆర్పి తాళ్ల సాయంతో బిల్డింగ్ లోపల ఉన్నవారిని రక్షించారు. ముగ్గురు మాత్రం అగ్నిమాపక సిబ్బంది వెళ్లే వరకే మృతిచెంది ఉన్నారు. మంటలను పూర్తిగా ఆర్పి వేశామని రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News