Thursday, January 23, 2025

కారు డ్రైవర్ నిర్లక్షంతో చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూర్: కారు డ్రైవర్ నిర్లక్షంగా వ్యవ హరించడంతో రెండేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన ఎల్‌బినగర్‌లో ఆలస్యంగా శుక్ర వారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… ఎన్‌టిఆర్‌నగర్‌లో ఉండే హబీ బుద్దిన్, శశిరేఖ దంపతులకు ధనలక్ష్మి(2) ఉంది. శశిరేఖ బ్యూ టీషియన్‌గా విధులు నిర్వర్తిస్తోంది. విధులు నిర్వర్తిం చేందుకు మ న్సూరాబాద్‌కు భార్యాభర్తలు తమ కూతురుతో బైక్‌పై వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కామినేని ఆస్పత్రి రోడ్డులో ఆగి ఉన్న కారు డ్రైవర్ ఒక్కసారిగా డోర్ తెరవడంతో వెనుక నుంచి వచ్చిన వీరి బైక్‌కు తగిలింది.

దీంతో ఒక్కసారిగా బైక్ అదుపు తప్ప డంతో శశిరేఖ, చిన్నారి ధనలక్ష్మి రోడ్డుపై పడిపోయారు. రోడ్డుపై పడడంతో చిన్నారి ధనలక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో కామినేని ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ చిన్నారి ధనలక్ష్మి మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న ఎల్‌బినగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం తల్లిదండ్రులకు అప్ప గించారు. కాగా చిన్నారి మృతికి కారణమైన కారు డ్రైవర్ కారును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News