Friday, December 27, 2024

డెంగ్యూతో చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

రాయికల్‌ః మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన గోనె మోక్ష(06) అనే చిన్నారి డెంగ్యూ జ్వరంతో ఆదివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గోనె రాజరెడ్డి,గౌతమిల కూతురు మోక్ష రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో కరీంనగర్ తరలించి చికిత్స

అందిస్తుండగా ఆదివారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో పాప శవాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. పాప శవాన్ని చూసి గ్రామస్తులు చలించిపోయారు. గత ఏడాది ఇదే గ్రామంలో డెంగ్యూ జ్వరాలు సోకి పలువురు మృత్యువాత పడ్డారని ఇప్పకైనా అధికారులు తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగ పాప తండ్రి ఉపాధి నిమిత్తం గల్ప్‌లో ఉండగా పాప మృతి విషయం తెలియగానే స్వగ్రామానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News