Monday, January 20, 2025

ఖమ్మంలో ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే చిన్నారి  గుండెపోటుతో మృతి !

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: నేడు చిన్నారులను కూడా గుండెపోటు కబలిస్తోంది. ఇదివరలోనైతే 50 ఏళ్ల వయస్సు దాటిన వారిలోనే ఎక్కువ వచ్చేది. కానీ నేడు పెద్దా చిన్నా తేడాలేకుండా గుండెపోటు ప్రాణాలు తీసుకుంటోంది. ఖమ్మం జిల్లాలో ముద్దొచ్చే నాలుగేళ్ల చిన్నారి…ఛాతీలో నొప్పి వస్తోంది…ఆసుపత్రికి తీసుకెళ్లండమ్మా.. అంటూనే కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆ పాప కన్ను మూయడం విషాధకరం.

వివరాల్లోకి వెళితే నాలుగేళ్ల ప్రహర్షిత ఖమ్మం రూరల్ మండలం ఎమ్ వెంకటాయపాలెంకు చెందింది. ఛాతీలో నొప్పిగా ఉందమ్మా ఆసుపత్రికి తీసెకెళ్లండమ్మా అని వాళ్ల అమ్మకు చెప్పిన కొద్ది నిమిషాలకే ఆయాస పడుతూ కుప్పకూలి పడిపోయింది. తల్లిదండ్రులు ఆర్ ఎంపి డాక్టరు దగ్గరికి తీసుకెళ్లినా బతకలేదు. సిపిఆర్ ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ప్రహర్షితను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలోనే ప్రాణాలు వదిలేసింది. పాఠశాలలో చాలా క్రియాశీలకంగా ఉండేదా అమ్మాయి. పైగా ఆ అమ్మాయికి ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా లేవు. కేవలం హఠాత్తుగా వచ్చిన గుండెపోటుతో చనిపోయింది. ఆ చిన్నారి మృతితో గ్రామంలో విషాధం చోటుచేసుకుంది. ముద్దుగా ఉండే అమ్మాయి హఠాత్తుగా చనిపోవడం చాలా మంది జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఇక ఒకగానొక్క కూతురిని కోల్పోయిన తల్లిదండ్రుల బాధ అయితే వర్ణనాతీతం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News