Sunday, December 22, 2024

బకెట్‌లో పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

కొత్తూరు : నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మున్సిపల్ కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. బీహార్‌కు చెందిన ధర్మేందర్ చోబె జీవనోపాధి కోసం కొత్తూరు వలస వచ్చి వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె (16 నెలలు) ఆడుకుంటూ వెళ్లి నీటి బక్కెట్‌లో పడి మృత్యువాత పడింది. తమ కుమార్తె ఎంతకూ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా చిన్నారి విగతజీవిగా పడి ఉండడాన్ని చూసి బోరున విలపించారు. చిన్నారి మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News