Friday, January 17, 2025

నీటి సంపులో పడి చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

మదనపురం: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం వడ్డెర కాలనీకి చెందిన వడ్డే సిద్దు, పార్వతిల కుమార్తె అక్షయ(4) ఎప్పటిలాగే గురువారం ఇంటి ముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి సంపులో పడిందని తెలిపారు.

తక్షణమే గుర్తించిన కుటుంబ సభ్యులు చిన్నారిని సంపు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయినట్లు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News