Thursday, December 26, 2024

పాము కాటుతో చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

ములుగు/నూగురు వెంకటాపురం : మండల పరిధిలోని వాడగూడెం గ్రామంలో పాము కాటుతో చిన్నారి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వాడగూడెం గ్రామానికి చెందిన తేజశ్రీ (6) ఇంట్లో అడుకుంటుండగా పాము కాటుకు గురైయ్యిందని తెలిపారు. గమనించిన గ్రామస్తులు పాపను ద్విచక్రవాహనం పై వెంకటాపురం వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అక్కడి వైద్యులు పాప పరిస్థితి విషమంగా ఉండటంతో ఏటూరునాగారం వైద్యశాలకు రిఫర్ చేశారు. తేజశ్రీను 108 లో ఏటూరునాగారం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందినట్లు తెలిపారు.

గ్రామస్తుల ఆందోళన

వాడగూడెం గ్రామానికి చెందిన తేజశ్రీ వైద్యుల నిర్లక్ష్యం వల్లనే మృతి చెందిందని, వైద్యుల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పాప మృత దేహంతో మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ లో ఆర్‌అండ్ బి రహాదారి పై బైటాయించి రెండు గంటల పాటు గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న వెంకటాపురం సీఐ శివ ప్రసాద్ సంఘటన ప్రాంతానికి చేరుకొని ఆందోళన కారులతో మాట్లాడి సర్ది చెప్పి ఆందోళన విరమింపజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News