Tuesday, January 21, 2025

శామీర్‌పేటలో పాముకాటుతో చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

Child dies of snakebite in Shamirpet

హైదరాబాద్: పాముకాటుతో చిన్నారి మృతిచెందిన విషాద సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్ పేటలో శనివారం చోటుచేసుకుంది. బాలరాజు, మమతా దంపతుల కుమారై స్నేహశ్రీ(5). బాత్రూమ్ కోసం బయటకి వెళ్లిన చిన్నారిని పాము కాటేసింది. గమనించిన తల్లిదండ్రులు హూటాహుటిన చిన్నారిని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్నేహశ్రీ ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతితో వారి కుటుంబంలో విషాదఛాయాలు అలుముకున్నాయి. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News