Wednesday, January 22, 2025

పౌష్టికాహార కేంద్రంలో గున్న ఏనుగు ఎముకల గూడు…

- Advertisement -
- Advertisement -

చెన్నై: పౌష్టికాహార కేంద్రంలో గున్న ఏనుగు ఎముకల గూడు కనిపించిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ జిల్లా వాల్పారై పట్టణంలో జరిగింది. పంచాయతీ ఎన్నికలు ఉండడంతో జనవరి 19న పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు. వాల్పారై పట్టణంలో హైపార్ట్ ఎస్టేట్‌లో పౌష్టికాహార కేంద్రం ఉంది. ఆ కేంద్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అధికారులు అనుకున్నారు. పౌషికాహార కేంద్రాన్ని తలుపులు అధికారులు తెరవగానే దుర్వాసన రావడంతో దగ్గరికి వెళ్లి చూశారు. గున్న ఏనుగు ఎముకల గూడు కనిపించడంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అటవీ శాఖ అధికారులు అక్కడి చేరుకొని గదిని పరిశీలించారు. గదిలో ఓ వైపున రంధ్రం ఉండడంతో ఆహారం కోసం గున్న ఏనుగు లోపలికి వచ్చిందని ప్రాథమికంగా నిర్థారించుకున్నారు. లోపలికి వచ్చిన గున్న ఏనుగు బయటకు వెళ్లడానికి దారి లేకపోవడంతో ఇక్కడే చనిపోయి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News