Sunday, December 22, 2024

నీటి బకెట్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి

- Advertisement -
- Advertisement -

child fell into a bucket of water and died

ఎల్బీనగర్ : నీటి బకెట్‌లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం నల్గోండ జిల్లా చండురు మండలానికి చెందిన సాయి లావణ్య దంపతులు. సాయి లావణ్య దంపతులు మనస్పర్దల కారణంగా లావణ్య మూడు నెలల క్రితం తన కోడుకు సహ ఎన్టీఆర్ నగర్‌లో తన పుట్టింటిలో ఉంటుంది. ఉద్యోగానికి పోయి వచ్చిన లావణ్య కూమారుడికి శ్రీమాన్ అన్నం తినిపించి నిద్ర పోయింది. అక్కడే ఆడుకుంటున్న శ్రీమాన్ ప్రక్కనే నీటి బెకెట్‌లోకి తోంగి చూస్తు అందులోకి బోర్లా పడ్డాడు.అనంతరం సాయంత్రం లావణ్య నిద్ర లేచిన తరువాత కూమారుడు బకెట్‌లో పడి ఉండగా హతుషురైలింది. వెంటనే స్దానికంగా ప్రవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసికోని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News