- Advertisement -
సూర్యపేట జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -