Wednesday, January 22, 2025

అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బోధన్ రూరల్ : బోధన్ మండలం కల్దుర్కీ గ్రామంలో చిన్నారి అమ్ములు (3) హత్య కలకలం రేపింది. తల్లి రాధా గ్రామస్తుడు సంజీవ్‌తో అక్రమ సంబంధం పెట్టుకుని తన కూతురుని గొంతు నులిమి హత్య చేసినట్లు బోధన్ రూరల్ ఠాణా ఎస్సై తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారి అమ్ములు అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని నెపంతో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని చిన్నారి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News