Friday, December 27, 2024

68గంటలుగా బోరుబావి లోనే చిన్నారి

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌లో ఓ బోరుబావిలో మూడేళ్ల చిన్నారి పడిపోయింది. ఆ బాలికను బయటకు తీసేందుకు దాదాపు 68 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ‘ర్యాట్ హోల్ మైనర్స్’ ను వినియోగిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కోఠ్‌పుత్లీ జిల్లాలో చేతన అనే చిన్నారి తన తండ్రి పొలంలో ఆడుకుంటూ సోమవారం 700 అడుగుల బోరు బావిలో పడిపోయింది. 150 అడుగుల లోతు వద్ద బాలిక చిక్కుకున్నట్టు అధికారులు గుర్తించారు. తొలుత కుటుంబ సభ్యులు ఆ పాపను రక్షించేందుకు ప్రయత్నించగా, మరింత కిందకు జారుకుంది.

ఈ క్రమంలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్ , ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రంగం లోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. పైపుతో బోర్ లోకి ఆక్సిజన్ పంపిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మంగళవారం క్లిప్‌ల సాయంతో 30 అడుగులు పైకి లాగినట్టు తెలిపారు. ఇప్పటికే 160 అడుగుల గొయ్యి తవ్వాం. ఇక చిన్నారి ఉన్న బోరుబావికి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. అది ఫైలింగ్ మిషన్‌తో కుదరదు. కాబట్టి మనుషులే తవ్వాల్సి ఉంటుంది. నేడు ఆ చిన్నారిని బయటకు తీస్తాం’ అని ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారి యోగేశ్ కుమార్ మీనా తెలిపారు. ప్రస్తుతం ర్యాట్ హోల్ మైనర్స్ సాయం తీసుకుంటున్నట్టు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News