పలు రకాల చర్యలు పిల్లలపై ప్రమాదకరమైన ప్రభావం
చైల్డ్ సైకాలజిస్టుల ద్వారా తల్లిదండ్రులు సలహాలు పొందాలి
చిన్నారులపై ఆంక్షలు విధించకుండా స్వేచ్చ నివ్వాలి: డా. అరవింద్‌కుమార్
మన తెలంగాణ,సిటీబ్యూరో: పిల్లల ప్రవర్తన, మనసత్వాలను తీవ్రంగా దెబ్బతీసే పలు రకాల చర్యనే పెంపకం సరిలేకపోవడం అంటారని వైద్యులు పేర్కొంటున్నారు. ఇది కేవలం ఒక చర్య కాదు, పలు రకాల చర్యల వల్ల సాధారణంగా పిల్లలపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుందని, వీటిలో చాలావరకు ఉద్దేశ్య పూర్వకం కావంటున్నారు. కానీ దీనివల్ల పిల్లలపై ప్రతికూల ప్రబావం తగ్గదు. కొందరు తల్లిదండ్రులకు దీనివల్ల వచ్చే పరిణామాలేంటో తెలియవు. కొందరు తెలిసినా లెక్కచేయరు, మంచి తల్లిదండ్రులు అవడం ఎలాగో తెలియకపోవడం, సరైన మార్గంలో నేర్చుకోవాలన్న కోరిక లేకపోవడంతో పెంపకం సరిలేకపోవడం సంభవిస్తుందని చెబుతున్నారు. వీటి లక్షణాలు పెంపకం సరిలేకపోవడానికి పలు చర్యలు,ఘటనలు కారణం కావచ్చు. ఎట్టి పరిస్దితుల్లోనూ చేయకూడదని కొన్ని పనులకు వివరిస్తున్నారు.
పిల్లలను ఎక్కవగా తిట్టడం, అందరి ముందు క్రమశిక్షణలో పెట్టడం, సలహాలే తప్ప ప్రోత్సాహం లేకపోవడం, ప్రేమను అణిచివేసుకోవడం, నిబంధనలు పెట్టడం, అండలేకపోవడం, వేరేవారితో పోల్చడం, వాళ్ల విజయాలపై గర్వపడకపోవడం, విమర్శనాత్మకంగా మాట్లాడటం, వాళ్ల భావనలను గౌరవించకపోవడం, మీరే సరిగా లేకపోవడం, వాళ్లకు అవకాశం ఇవ్వకపోవడం,అతిగారాబం, అతిగా రక్షించడం, నమ్మకం లేకపోవడం, సమాయాన్ని వెచ్చించకపోవడం.
పెంపకం సరిలేకపోవడం వల్ల పిల్లలపై ప్రభావం: పెంపక సరిగా లేకపోతే పిల్లల ప్రవర్తన, మనస్తత్వాలపై దీర్ఘకాలిక ప్రభావం పడుతుంది. ఆప్రభావాల్లో కొన్ని అసాంఘిక ప్రవర్తన, తట్టుకునే సామర్దం లేకపోవడం, కుంగుబాటు, దురాక్రమణ, సానుభూతి చూపకపోవడం, సంబంధాల విషయంలో కష్టాలు.
మంచి తల్లిదండ్రులు అవ్వడం ఎలా: మీపెంపకం సరిగా లేదని ఒప్పుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. ఈలోపాలను అధిగమించిడానికి మీరు మార్గాలు నేర్చుకోవచ్చు. మంచి తల్లిదండ్రులు అయ్యేందుకు కొన్ని సూచనలు. తోడుగా ఉండండి, పిల్లలపై అరవొద్దు, కారణాలు తెలపండి, నియమాలు చెప్పండి, పిల్లలకు అవకాశాలు ఇవ్వాలి, వారి మాటలను వినాలి, మంచి ఉదాహరణాలివ్వాలి, చెయ్యి ఎత్తద్దు, బహుమతులు, శిక్షల పద్దతి పాటించండి, పిల్లలను ఇబ్బంది పెట్టద్దు..
పిల్లలు తమ కాళ్ల మీద నిలబడేలా చూడాలి: డా. అరవింద్‌కుమార్
పెంపకం సరిగా లేకపోతే పిల్లలకు అప్పడు కీడు చేయడమే కాదు, తరువాత చాలాకాలం పాటు పెద్దయ్యాక కూడా వారిపై ప్రతికూల ప్రభావం పడుతుంది. పెంపకం అంటే పిల్లలకు విజ్ఞానం నేర్పడమే కాదు, వాళ్లు తమ కాళ్లమీద నిలబడేలా చూడటం ముఖ్యమని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి వైద్యులు డా. అరవింద్ కుమార్ తెలిపారు. వాళ్లకు పనులకు, తీసుకునే నిర్ణయాలకు వారినే బాధ్యులను చేయడం కూడా ఇందులో ఉంటుంది. పిల్లలకు విజ్ఞానం ఎలా పెంచాలో వారికి బాధ్యత ఎలా చెప్పాలోనన్న విషయం వారి పెంపకంలో చాలా కీలకమని, వాళ్లపై ఏది బలవంతంగా రుద్దకూడదన్నారు. పిల్లలతొ ఎలా ఉండాలో చైల్డ్ సైకాలజిస్టులను అడిగి తెలుసుకోవాలి. తల్లిదండ్రులు ఇద్దరు పేరెంటింగ్ సెమినార్లకు వెల్లి, కౌన్సెలర్‌తో మాట్లాడి, పిల్లల పెంపకానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవాలి. పరస్పర గౌరవం, అన్నీ మాట్లాడటం చాలా ముఖ్యం, పిల్లలను తప్పులు చేయనివ్వండి, వారి వైఫల్యాల నుంచి నేర్చుకునేలా ప్రోత్సాహించాలని సూచించారు. పిల్లలపై మరీ ఎక్కువగా ఆంక్షలు విధంచకూడదని ప్రతి తల్లి, తండ్రి తప్పక తెలుసుకోవాలి, సరదాగా, పదిమందితో కలిసి మెలిసి ఉంటే వారి మానసిక ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుందన్నారు.