- Advertisement -
చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో చిన్నారి కిడ్నాప్ కి గురైంది. దంపతుల మధ్య నిద్రిస్తున్న చిన్నారిని దుండగులు అపహరించారు. ఆదివారం రాత్రి చిన్నారి ఇమ్మారెడ్డి శివ (4నెలలు) అపహరణ గురికావడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితులను చివ్వెంల పోలీసులు విచారిస్తున్నారు. డిఎస్పీ మోహన్ కుమార్ నేతృత్వంలో పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
- Advertisement -