Thursday, January 23, 2025

దేశంలో బాల్య వివాహాలు నిర్మూలించాలి

- Advertisement -
- Advertisement -

2030 నాటికి బాల్య వివాహ రహితంగా చేయాలి: బచ్‌పన్ బచావో ఆందోళన్

మన తెలంగాణ/హైదరాబాద్ : బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించడానికి బహుముఖ, బహుమితీయ వ్యూహం అవసరమని బచ్‌పన్ బచావో ఆందోళన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనంజయ్ తింగల్ పేర్కొన్నారు. నోబుల్ గ్రహీత కైలాష్ సత్యార్థి గత సంవత్సరం సమర శంఖారావాన్ని పూరించినప్పుడు, దేశం వ్యాప్తంగా అపూర్వమైన స్పందన వచ్చిందని, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 7028 గ్రామాల్లో 76వేల మంది మహిళలు, పిల్లలు వీధుల్లోకి వచ్చారని పేర్కొన్నారు. ఈ సంప్రదింపులు 2030 నాటికి భారతదేశాన్ని బాల్య వివాహ రహితంగా చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. శుక్రవారం బచ్‌పన్ బచావో ఆందోళన్, వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సహకారంతో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ ఉద్యమానికి బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, పంచాయతీరాజ్, మహిళా, శిశు అభివృద్ధి శాఖ, రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ , తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ సహకారంతో ముందుకు వెళ్లుతున్నట్లు చెప్పారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు ఈ రంగంలో నిమగ్నమైన వివిధ సంస్థలు పాల్గొన్నట్లు బాల్య వివాహ రహిత భారతదేశం అనే విశాల దృక్పథంతో బాల్య వివాహ రహిత తెలంగాణ సాకారానికి బాలబాలికల రక్షణలో భాగస్వాములైన వారందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. అనంతరం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ చైర్ పర్సన్ శ్రీనివాసరావు ప్రసంగిస్తూ బాల్య వివాహ రహిత భారత్‌గా మార్చడంలో జాతీయ బాలల హక్కుల సంఘం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

భారతదేశంలో బాల్య వివాహాలు ఒక ముఖ్యమైన సమస్య, అనేక చైల్ ఫ్రెండ్లీ టీమ్‌లు ఈ పరిస్థితిని చురుకుగా పర్యవేక్షిస్తాయి. ఏది ఏమైనప్పటికీ, కుటుంబాల్లోని ప్రతిఘటన, తరచుగా పేదరికం బంధువులను వివాహం చేసుకోవాలనే ఒత్తిడి బాల్య వివాహాలకు ఆజ్యం పోస్తుందన్నారు. బాల్య వివాహాలు ఆడపిల్లలకు మొత్తం సమాజానికి తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని అవగాహన కల్పించడంలో ప్రాథమిక సమస్య ఉంది. ఒక అమ్మాయి తల్లి అయినప్పుడు ఆమె జీవితంలో జరిగే లోతైన పరివర్తన గురించి అవగాహన పెంచుకోవడంలో ఆవశ్యకత ఉందన్నారు. ఆమె ఎదుర్కొనే బాధ్యతలు, నష్టాలు త్యాగాల భారం తరచుగా గుర్తించబడదని జాతీయ మహిళా కమిషన్ దీనిని గుర్తించి విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. అదే విధంగా మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హొల్లికేరి మాట్లాడుతూ తెలంగాణలో ఈ సంవత్సరం బాల్య వివాహాలు 26.2 శాతం నుండి 23.5 శాతానికి తగ్గాయని చెప్పటానికి నేను సంతోషంగా ఉందని గ్రామస్థాయి బాల్య వివాహాలను డిసిపిఓ, చైల్ లైన్ సిబ్బంది, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తాము భరోసా అనే ఒక వన్ స్టాప్ సెంటర్‌ను స్థాపించినట్లు దానిని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.

ఈకార్యక్రమం ద్వారా 18 సంవత్సరాల వయస్సు తర్వాత వివాహం చేసుకునేలా అమ్మాయిలను ప్రోత్సహించే లక్ష్యం పెట్టుకున్నట్లు బాల్య వివాహాల నిర్మూలనను సూచించే స్థిరమైన అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మేము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జి కళార్చన – సెక్రటరీ (సీనియర్ సివిల్ జడ్జి), రామారావు – డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పీవీ పద్మజ – ఎస్పీ, మహిళా భద్రతా యాదగిరి శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News