Wednesday, January 22, 2025

పిల్లల విక్రయ ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

11 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…పరారీలో ముగ్గురు
16మంది శిశువులను రక్షించిన రక్షకభటులు
ఒక్కొక్కరిని రూ.లక్ష నుంచి రూ.ఐదున్నర లక్షలకు విక్రయిస్తున్నముఠా

ఆర్‌ఎంపి వైద్యురాలు శోభారాణి కీలక పాత్ర అరెస్టు
తరువాత కదిలిన డొంక

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పిల్లలను విక్రయిస్తున్న అం తరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. పదకొండు మంది సభ్యుల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు వారి వ ద్ద నుంచి 16 మంది పిల్లలను రక్షించారు. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మేడిపల్లి, పీర్జాదిగూడకు చెందిన ఆర్‌ఎంపి వైద్యురాలు శోభారాణి, చెంగిచెర్లకు చెందిన హేమలత అలియాస్ స్వ ప్న, షేక్ సలీమా, భండారి హరిహర చేతన అలియాస్ హ రి, భండారి పద్మ, బలగం సరోజ, ముడావత్ శారద, ము డావత్ రాజు, పతాన్ ముంతాజ్ అలియాస్ హసీనా, జగన్నాథం అనురాధ, యాట మమత కలిసి పిల్లలను విక్రయిస్తున్నారు.

పూణే, ఢిల్లీకి చెందిన కిరణ్, ప్రీతి, కన్నయ్య అక్కడ తల్లిదండ్రులకు రూ.50,000 నుంచి లక్ష రూపాయలకు వరకు ఇచ్చి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. ఇలా కొనుగోలు చేసిన పిల్లలను ఎపి, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పిల్లలు లేని దంపతులకు విక్రయిస్తున్నారు. ఒక్కొక్కరిని రూ.1.80 లక్షల నుంచి రూ.5.50 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇలా కొనుగోలు చేసే పిల్లల్లో రెండు నెలల నుంచి రెండేళ్ల వయ స్సు ఉన్న పిల్లలు ఉన్నారు. వీరిని నగరానికి తీసుకుని వచ్చి పిల్లలు లేని దంపతులకు విక్రయించారు.

ఈ ముఠా ఆర్‌ఎంపి వైద్యురాలు శోభ ద్వారా పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నారు. పిల్లలను ఆర్‌ఎంపి ద్వారా విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో మేడిపల్లి పోలీసులు నిఘా పెట్టి శిశువును విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ముఠాకు సంబంధించిన మొత్తం వివరాలు బయటికి వచ్చాయి. ఈ ముఠా ఇప్పటి వరకు 16 మందిని విక్రయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పిల్లలను పెంచుకుంటున్న వారి వద్ద నుంచి తీసుకుని శిశు సంరక్షణ అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలో ఆ పిల్లలను పెంచుకుంటున్న ఆ తల్లులు బోరున విలపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News