Sunday, December 22, 2024

హైదరాబాద్ శివారులో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ నగర శివారులో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలోని మేడిపల్లిలో పసిపిల్లలను అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి…ముఠా నుంచి 16 మంది పిల్లలను కాపాడారు.

ఇతర రాష్ట్రాల పేద పిల్లలను అపహరించి.. తెలంగాణకు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News