- Advertisement -
ముషీరాబాద్ : దోమలగూడ రోజ్‌కాలనీలో మంగళవారం చోటు చేసుకున్న గ్యాస్ సిలిండర్ పేలిన ప్రమాదంలో 11 ఏళ్ల చిన్నారి శరణ్య మృతి చెందింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 7 గురు క్షతగాత్రులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బోనాల పండుగ నేపథ్యంలో ఇంట్లో పిండి వంటలకు సిద్ధమవుతుండగా గ్యాస్ లీకై ఆకస్మాత్తుగా మంటలు చేలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 7 గురు సభ్యులు అగ్ని ప్రమాదానికి బలై మంటల్లో కాలిపోయారు. వీరిలో ఇంటి యాజమాని పద్మ మనుమరాలు శరణ్య (11) గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొ ందుతూ బుధవారం ఉదయం 11 గంటల సమయంలో మరణించినట్టు దోమలగూడ సిఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మిగతా వారు ఇంకా గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్టు ఆయన తెలిపారు. చికిత్స పొందుతున్న 6 గురి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు.
- Advertisement -