- Advertisement -
మరో శిశువుకు పుదుచ్చేరిలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్‌ఎంపివి) పాజిటివ్ అని తేలిందని, ‘జిప్‌మేర్’ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఓ ఆడ శిశువుకు జ్వరం, దగ్గు, ముక్కు కారడం రావడంతో ఆసుత్రికి చికిత్స కోసం వచ్చినట్లు పుదుచ్చేరి హెల్త్ డైరెక్టర్ వి. రవిచంద్రన్ ఓ ప్రకటనలో తెలిపారు.
కొన్ని రోజుల క్రితమే ఆమె జిప్‌మేర్ ఆసుపత్రిలో చేరిందని, చికిత్స కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఆ శిశువు కోలుకుంటోందని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. పుదుచ్చేరిలో తొలి హెచ్‌ఎంపివి వ్యాధి ఓ మూడేళ్ల శిశువుకు గత వారం సోకగా, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ శిశువు కోలుకున్నాక శనివారం డిశ్చార్జ్ చేశారు. హెచ్‌ఎంపివి వెలుగుచూసిన నేపథ్యంలో పుదుచ్చేరి పాలకవర్గం అన్ని చర్యలు చేపట్టింది.
- Advertisement -