Saturday, December 28, 2024

చిన్నారిని ఢీకొట్టిన కారు.. చికిత్స పొందుతూ బాలుడి మృతి

- Advertisement -
- Advertisement -

అజాగ్రత్తగా నడిపిన వాహనం ఇంటి బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిని ఢీకొనడంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన సంఘటన మీర్‌పేట్ పొలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కీసర నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హస్తినాపురం జెడ్‌పి రోడ్డులో నివాసం ఉండే వరికుప్పల రామకృష్ణ వృత్తిరీత్యా కారు డ్రైవరు. కాగా ఈనెల 18వ తేదీన సాయంత్రం సుమారు 7:30 గంటలకు కామకృష్ణ కుమారుడు దీక్షిత్ (22 నెలలు) ఇంటి ముందు ఆడుకుంటున్న క్రమంలో కొత్తకాపు దినేష్‌రెడ్డి

అనే వ్యక్తి తన టాటా హారియర్ (టిఎస్ 07 కెడి 45467) కారును అజాగ్రత్తగా నడపడంతో వాహనం దీక్షిత్‌ను ఢీకొట్టింది.దీంతో తలకు గాయమై తీవ్ర రక్తస్రావానికి గురైన దీక్షిత్‌ను చికిత్స నిమిత్తం అతని తల్లిదండ్రులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దీక్షిత్ ఈనెల 19వ తేదీన అర్ధరాత్రి 2 గంటల సమయంలో మృతి చెందాడు. ఈ మేరకు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News