Tuesday, December 24, 2024

ప్రభుత్వ ఆసుత్రులలో ప్రసవాలను పెంచాలి

- Advertisement -
- Advertisement -

జమ్మికుంట: ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి ఆదేశించారు. గురువారం జమ్మికుంట పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల ఆరోగ్యశాఖ సిబ్బందితో రివ్యూ మీటింగ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి లలితాదేవి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుత్రులలో ప్రసవాలు జరిగితే తల్లి, బిడ్డ సురక్షితంగా ఉంటారని గర్భిణులు ఆరోగ్యంగా ఉండడం కోసం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ ఇవ్వడం జరుగుతుందని వివరించాలని సూచించారు.

ప్రభుత్వ వైద్యులు ఒకవేళ ప్రైవేట్ ప్రసవాలను ప్రోత్సహించినట్లు ఫిర్యాదులు వస్తే అటువంటివారి జీతాలను నిలిపేవేసి శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ఆరోగ్య ఉపకేంద్రాల వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలని ఒకవేళ పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డాక్టర్ చందూ, హుజురాబాద్ సూపరిండెంట్ డాక్టర్ రమేష్, వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ సనజవేరియా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సాజిద్, శంకర్‌రెడ్డి, డిస్టిక్ హెల్త్ ఎడ్యూకేటర్ పంజాల ప్రతాప్‌గౌడ్, హెల్త్ ఎడ్యూకేటర్స్ రేష్మ, అశోక్, హెచ్‌ఈఓ రమేష్, సూపర్‌వైజర్లు, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News