Monday, December 23, 2024

53 ఏళ్ళ తర్వాత కలుసుకున్న బాల్యమిత్రులు

- Advertisement -
- Advertisement -

నడిగూడెం: స్థానిక కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1968వ సంవత్సరంలో చదువుకున్నటు వంటి పూర్వ విద్యార్ధుల సమ్మెళణం ఆదివారం ఘనంగా జరిగింది. 53 ఏళ్ళ తరువాత తిరిగి కలుసుకున్న బాల్యమిత్రులు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. నాటి గురువు అయిన షేకు వెంకటేశ్వర్లు దంపతులను ఘనంగా సత్కరించారు.

పూర్వ విద్యార్ధులు ఎల్విల్ కె ప్రసాద్, జల్లా నాగేశ్వరావు, రాంబాబు, సీతమ్మ, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాల అబివృద్ది కోసం పూర్వ విద్యార్ధి రాంబాబు రూ.50వేల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చరిత్రకారుడు జితేంద్రబాబు, షేక్ శ్రీనివాస్, ఎండి మౌలానా, జానిమియా, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News