Sunday, December 22, 2024

సెలవు కోసం.. తోటి విద్యార్థిని కొట్టిన చంపిన పిల్లలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని డిల్లీలోని మదర్సాలో తోటి విద్యార్థిపై ముగ్గురు విద్యార్థులు దాడి చేసి కొట్టిచంపారు. 9 నుంచి 11 సంవత్సరాలలోపు ఈ ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. స్కూల్‌కు సెలవు దినం ప్రకటించాలనే ఆలోచనతో మరీ చిన్నవాడైన విద్యార్థిని ఎంచుకుని కొట్టి చంపేసినట్లు విచారణ క్రమంలో వెల్లడైంది. మృతుడైన బాలుడి కడుపులోపల తీవ్రగాయాలు అయినట్లు గుర్తించారు, కడుపు కాలేయం బాగా దెబ్బతింది. లోపల బాగా రక్త స్రావం కావడం, కుడి ఊపిరితిత్తి దెబ్బతినడంతో బాలుడు మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

అయితే తమతో తగవు పడి, తిట్టకు దిగడంతో కొట్టామని ఓ బాలుడు తెలిపాడు. శుక్రవారం ఈ బాలుడి విషాదాంతం జరిగింది. తీవ్ర గాయాలతో ఇంటికి చేరుకుని పడిపోయి ఉన్న బాలుడిని గుర్తించి తల్లి సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా అంతర్గత గాయాలతో చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.ఈ ఘటనపై కేసు దర్యాప్తు సాగుతోందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News