Monday, January 20, 2025

మృత్యువు ఒడిలో చిన్నారులు

- Advertisement -
- Advertisement -

ఓదెల: మండలంలోని పొత్కపల్లి గ్రామంలో ఇద్దరు చిన్నారుల మరణవార్త తీవ్ర దిగ్బాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళ్లితే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగులకు చెందిన జూపాక సాత్విక్(14), కాసర్ల నిత్య (12)లు మండలంలోని పొ త్కపల్లి గ్రామంలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు.

బుధవారం వీరు ఈత కోసం పొత్కపల్లి గ్రామ సమీపంలోని మానేరు నదిలోని చె క్ డ్యాం సమీపంలో నీటిలో దిగగా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీం తో పోలీసులతోపాటు అగ్నిమాపక బృందాలు మానేరులో గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

అయితే ఇద్దరు నీటి గుంతలో చిక్కుకుని మృత్యువాత పడటం స్థానికులను కలిసి వేసింది. ఈ మేరకు వారిని బయటకు తీసి ఎస్‌ఐ రామకృష్ణ తన వా హనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పరీక్షించగా అప్పటికే వారు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News