Sunday, January 12, 2025

పిల్లల జీవన ప్రమాణాలు పెరిగాయా?

- Advertisement -
- Advertisement -

అభివృద్ధి చెందుతున్న దేశాలలో పిల్లలు, వారి తల్లుల జీవనప్రమాణాలు మెరుగుపరచడానికి కృషి చేయడమే లక్ష్యంగా 1946 డిసెంబరు 11న యునిసెఫ్ ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. మొదట దీనిని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి (యునిసెఫ్) అని పిలిచారు. ప్రస్తుతం దీని పేరులో ‘అంతర్జాతీయ’, ‘అత్యవసర’ అనే పేర్లను తొలగించి ఐక్య రాజ్య సమితి బాలల నిధిగా వ్యవహరిస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధానంతరం 1946 నుండి 1950 వరకు, ‘అత్యవసర అవసరాల విధానం’ అంటే పిల్లల ఆహారం, దుస్తులు, ఆరోగ్య అవసరాలను, ముఖ్యంగా ఐరోపాలో యునిసెఫ్ పన్నెండు దేశాలలో ఐదు మిలియన్ల పిల్లలకు వివిధ రకాల దుస్తులను పంపిణీ చేసింది.

క్షయవ్యాధికి వ్యతిరేకంగా ఎనిమిది మిలియన్లకు టీకాలు వేసింది. పాల ప్రాసెసింగ్, పంపిణీ సౌకర్యాలను పునర్నిర్మించింది. ఐరోపాలో మిలియన్ల మంది పిల్లలకు రోజువారీ అనుబంధ భోజనాన్ని అందించింది. 1951- 1960 మధ్య కాలంలో యునిసెఫ్ అత్యవసర అవసరాలను తీర్చడం కొనసాగించింది. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటానికి, యునిసెఫ్ క్షయ, కుష్టు వ్యాధి, మలేరియాకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించింది. పర్యావరణ పారిశుద్ధ్యం కోసం నిబంధనలు రూపొందించింది. తల్లి, పిల్లల ఆరోగ్య సంరక్షణ విద్యను ప్రోత్సహించింది. పిల్లలకు పోషక ప్రమాణాలను పెంచడానికి, యునిసెఫ్ దేశాలకు తక్కువ -ధర, అధిక ప్రోటీన్ కలిగిన ఆహార పదార్థాలను ఉత్పత్తి చేయడానికి, అలాగే పంపిణీ చేయడానికి సహాయ పడింది. పిల్లల సాంఘిక సంక్షేమం కోసం, యునిసెఫ్ పిల్లల పెంపకం, గృహ మెరుగుదలపై తల్లులకు అనధికారిక శిక్షణ, డే కేర్, పొరుగు కేంద్రాలు, కుటుంబ సలహా, యువజన క్లబ్‌ల ద్వారా పిల్లలకు సహాయక సేవలను ఏర్పాటు చేసింది.

1961-1970 కాలంలో యునిసెఫ్ పిల్లలకు దేశాభివృద్ధికి సహాయం చేసే భావనను పెంపొందించే కార్యక్రమాలకు అనుసరించింది. జాతీయ విధానం, పిల్లలకు సహాయపడే కార్యక్రమాల మధ్య పరస్పర సంబంధాన్ని గుర్తించి, దేశం విధానమని పిలువబడే ఈ విధానం, యునిసెఫ్ పిల్లల అవసరాలను తీర్చడంలో ప్రతి దేశం తాను ఏర్పాటు చేసిన ప్రాధాన్యతలను తగిన మార్గాల్లో అమలు చేయడానికి అనుమతించింది. పర్యవసానంగా పిల్లల మేధో, మానసిక, వృత్తిపరమైన అవసరాలతో పాటు వారి శారీరక అవసరాలను తీర్చడం యునిసెఫ్ ఉపాధ్యాయ విద్య, పాఠ్యాంశాల సంస్కరణలకు సహాయం అందించింది. పూర్వవృత్తి శిక్షణ కోసం నిధులు కేటాయించింది. సాంకేతికం విద్యను, సమాచారాన్ని ప్రోత్సహించింది. అంతర్జాతీయ, బహుళజాతి, ఆదాయ వనరుల సమకూర్పుకు ప్రభుత్వేతర ఏజెన్సీల నుండి మద్దతును పొందాలని యునిసెఫ్ భావించి, తదనుగుణ చర్యలు చేపట్టింది.

గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, ప్రసూతి వార్డు లు, ఉపాధ్యాయ శిక్షణా పాఠశాలలు, ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలు, ఉచిత వృత్తి శిక్షణా పాఠశాలలు, ఉచిత వృత్తి బోధకులకు శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలు, ఆహార సిబ్బందికి శిక్షణ ఇవ్వడానికి పాఠశాలలు; పోషకాహార కేంద్రాలు, కమ్యూనిటీ గార్డెన్స్, డే కేర్ సెంటర్లు, బిలియన్లలో దుస్తు పంపిణీ, అనుబంధ భోజనం, వరదలు, భూకంపాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలకు గురైన లక్షలాది మందికి అత్యవసర సహాయం అందించింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 307 మిలియన్ల మంది పిల్లలు పోషకాహార లోపాన్ని నివారించడానికి,17 మిలియన్ల మంది పాఠశాల నుండి బయట పిల్లలు; నైపుణ్యాల అభివృద్ధితో 4 మిలియన్ల పిల్లలు, యువకులు లాభోక్తులైనారు. సురక్షితమైన తాగునీరు 18.3 మిలియన్ల ప్రజలు; ప్రాథమిక పారిశుధ్య సేవలతో 15.5 మిలియన్లు, 96 దేశాలలో 281 అత్యవసర పరిస్థితుల్లో మానవతా సహాయం పొందారని స్పష్టం చేసింది.

రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News