Monday, December 23, 2024

మంచురూపంలో శివలింగాన్ని తయారు చేసిన చిన్నారులు

- Advertisement -
- Advertisement -

బాసర ః నిర్మల్ జిల్లా బాసర మండలం మైలాపూర్ గ్రామానికి చెందిన మమ్మయి మహేంధర్ మౌనిక దంపతుల కుటుంబానికి చెందిన అక్షర, ప్రతీక్ ఇద్దరు చిన్నారులు కలిసి తమ ఆలోచనలతో మంచుతో కూడిన శివలింగాన్ని తయారు చేశారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం వర్షాల కారణంగా వరుసగా పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో ఖాళీ సమయంలో ఏమి చేయాలనే ఆలోచనతో ఇంటి వద్ద ఉండి సమయాన్ని వృధా చేయకుండా అన్నా చెల్లెలు కలిసి టీవిలో జమ్మూ కాశ్మీర్‌లోని అమర్నాథ్ ఆలయ సహజ మంచు శివాలయం ఏ విధంగా ఉండేది అని టివిలలో

చూసేవారు అదే ఆటోచనలతో రెండు వెండి పాత్రలు తీసుకొని వాటిలో నీరు, పాలు పోసి డి ప్రిడ్జిలో ఉంచారు. మర్నాడు ప్రిడ్జిను తెరిచి మంచు శివలింగంను బయటకు తీయడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఓం నమశివాలయ అంటూ కాలనీ వాసులు మంచుతో తయారైన కాశ్మీర్‌లోని అమర్నాథ్ సహజ శివలింగం రూపంలో దర్శించుకున్నారు. అతి చిన్న వయస్సులో చిన్నారులకు ఇలాంటి భక్తి ఆలోచన రావడం చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులతో పాటు కాలనీవాసులు చిన్నారులను అభినందిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News