Monday, December 23, 2024

మత్తులో జోగుతున్నది వారి పిల్లలే

- Advertisement -
- Advertisement -

Children of Congress and BJP leaders are swayed by drugs

పబ్ నిర్వాహకుడు బిజెపి నాయకురాలి కుమారుడు అభిషేక్ కాగా, నిందితుల జాబితాలో రేవంత్ మేనల్లుడు ప్రణయ్‌రెడ్డి

నీతులు చెప్పడం కాదు.. మీ పిల్లలను, బంధువులను దారిలో
పెట్టుకోవాలి డ్రగ్స్ కేసులో ఎవరున్నా వదిలి పెట్టవద్దని డిజిపి, సిపిలకు
విజ్ఞప్తి చేస్తున్నా మీడియా భేటీలో బాల్క సుమన్

మన తెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్, గంజాయి మత్తులో ఊగుతున్నది జాతీయ పార్టీలైన కాంగ్రె స్, బిజెపి నాయకుల పిల్లలే అని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూరు నియోజకవర్గం శాసనసభ్యులు బాల్క సుమన్ ఆరోపించారు. రాష్ట్రాన్ని డ్రగ్స్‌లో ముంచుతున్నది కేవలం ఆ రెండు పార్టీల నేతలేనని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ‘ ఫుడ్డింగ్ అండ్ మింక్’ పబ్‌లో జరిగిన ఘటన చాలా స్పష్టంగా రుజువు చేస్తోందన్నారు. ఆ పబ్‌లో పట్టుబడిల పిల్లలంతా బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెం దిన నాయకుల కుటుంబాలకు చెందిన వారేనని అన్నారు.

ఈ నేపథ్యంలో నీతులు సమాజానికి చె ప్పడం కాదు.. ముందు మీ పిల్లలకు, బంధువులకు చెప్పుకోవాలని ప్రతిపక్ష నేతలకు ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభు త్వం ఎట్టి పరిస్థితులను సహించదన్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఉన్నా…వారిని వదిలిపెట్టవద్ద ని టిఆర్‌ఎస్ పక్షాన తాము పోలీసు శాఖను కోరుతున్నామన్నారు. తెలంగాణ భవన్‌లో ఎంఎల్‌ఎ కెపి వివేకానందతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాల్క సుమన్ మా ట్లాడుతూ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ వినియోగం జరుగుతందని పోలీసులకు సమాచారం అందడంతో చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ పబ్ నిర్వాహకులు బిజెపి నాయకురాలు ఉప్పల శారద కుమారుడు అభిషేక్ ఉప్పలది అని తేలిందన్నారు. ఉప్పల శారద 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గం నుంచి బిజెపి తరపున పోటీ చేశారని ఈ సందర్భంగా బాల్కసుమన్ గుర్తు చేశారు. అభిషేక్ బిజెపి కండువా కప్పుకొని ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా మీడియా సమక్షంలో ఆయన చూపించారు. ఇక ఈ కేసులో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మేనల్లుడి పేరు కూడా ఉందన్నారు.

పోలీసులు విడుదల చేసిన జాబితాలో 24వ పేరు సూదిని ప్రణయ్ రెడ్డి(రేవంత్ మేనల్లుడు)ది ఉందన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్ కూడా కొనసాగుతున్నారని బాల్కసుమన్ తెలిపారు. దీంతో ఈ రెండు జాతీయ పార్టీలకు సంబంధించిన నాయకుల పిల్లలు పాల్గొన్నట్లుగా తెలుస్తోందన్నారు. ఈ కేసులో ఎవరిని వదిలిపెట్టొద్దని పోలీసులను కోరుతున్నానని అన్నారు. తప్పు చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. డ్రగ్స్ నిందితులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని పార్టీ తరపున డిజిపి మహేందర్ రెడ్డి, సిపి ఆనంద్‌ను కోరుతున్నానని అన్నారు. సమాజాన్ని పట్టిపీడిస్తోన్న అంశాల పట్ల టిఆర్‌ఎస్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందని బాల్క సుమన్ తేల్చిచెప్పారు.
దల చేశారు.

ఎవరిని ఉరి తీయాలి…ఎవరిని షూట్ చేయాలి?

రాష్ట్రంలో డ్రగ్స్ విషయం వచ్చేసరికి కాంగ్రెస్, బిజెపి నాయకులు చాలా మాట్లాడుతారని బాల్కసుమన్ అన్నారు. అలాంటి వారిని షూట్ చేయాలి, ఉరి తీయాలని మాట్లాడుతారన్నారు. మరి ఇవాళ ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో దొరికివారంతా ఎవరూ? ఎవరిని ఉరి తీయాలో… ఎవరిని షూట్ చేయాలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు సమాధానం చెప్పాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా దానిని టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై రుద్దేందుకు యత్నించడంలో ఆ ఇద్దరు నేతలు చాలా ముందుంటారన్నారు. మరి దీనిపై వారు నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు.

ఆ రెండు పార్టీలకు చెందిన కుటుంబాలకు చెందిన పిల్లలు ఉండడంతో వారి నోటి నుంచి మాటలు రావడం లేదన్నారు. ఆ రెండు పార్టీల నేతలు రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది ముఖ్యమంత్రి కెసిఆర్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఆయన ముందు సంజయ్, రేవండ్‌రెడ్డిల పప్పు ఉండకవన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను మీడియా ముందు పెడుతున్నామన్నారు. కాంగ్రెస్, బిజెపి నాయకుల పిల్లల్లోనే డ్రగ్స్ విచ్చలవిడితనం ఉందని ఈ ఘటనతో మరోసారి రుజువైందన్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలకు చెందిన నేతలే ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలన్నారు. లేదంటే తగినరీతిలో బుద్ధి చెబుతారని బాల్క సుమన్ హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News