మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కేంద్రంలో బిజెపిని ఓడించి 2024లో ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇం దుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నాంది పలకబోతున్నాయని కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో మంగళవారం సా యంత్రం నిర్వహించిన పాలమూరు ప్రజా గర్జ న ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కొల్లాపూర్ నియోజకవర్గ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వంశీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికలు కేంద్రంలో అధికారానికి నాంది పలకాలన్నారు.
తెలంగాణ ప్రజలు కలలుగన్న ప్రజా తెలంగాణ సాధించుకోవడానికి రాబోయే ఎన్నికలను తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తెలంగాణ బిడ్డల పోరాటాన్ని చూసి సోనియాగాంధీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ప్రత్యేక రాష్ట్రా న్ని ఏర్పాటు చేశారన్నారు. పీడిత, దళిత, గిరిజన, పేద, మధ్య తరగతి ప్రజలకు తెలంగాణలో న్యాయంజరగాలని ఈ నిర్ణయం తీసుకు న్నా రని అన్నారు.బిజెపి ఆదేశిస్తే ఎంఐఎం దే శంలో ని ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడ వారికి ఉనికి లేకపోయినా తమ అభ్యర్థులను నిలబెట్టి ఓటు బ్యాంకును చీల్చి పరోక్షంగా బిజెపికి అధికారాన్ని కట్టబెడుతుంది ఎంఐఎం పార్టీ అన్నది తెలంగాణ సమా జం గుర్తించాలన్నారు. తెలంగా ణ ప్రజలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వాన్ని నిర్మా ణం చేయబోతుందన్నారు. తెలంగాణ ప్రజలతో తమకున్నది రాజకీయ బంధం కాదని కుటుంబ బంధమని రాహుల్ అన్నారు. ఈరోజు స్వర్గీయ ఇందిరా గాంధీ వర్ధంతి దినమన్నారు.
గతంలో ఇందిరా గాంధీకి రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో తెలంగాణ ప్రజలు అండగా నిలబడ్డారని, జీవితంలో తెలంగాణ బిడ్డలను ఎన్నడు మరిచిపోలేనన్నారు. దేశానికి మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించింది, పరిశ్రమలను, ఐటి రంగాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలను తీసుకువచ్చిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జున సాగర్, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు, సింగూరు, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కట్టిన చారిత్రాత్మిక ప్రాజెక్టులను ఒకసారి చూడాలని ప్రజలను కోరారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చిందని, మీ కలలను కాంగ్రెస్ పార్టీ సాకా రం చేయబోతుందన్నారు. మహాలక్ష్మి స్కీంతో వివాహిత మహిళలకు రూ.2500, రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగే విధంగా మహిళలందరికి ఉచిత రవాణా, ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు, 200 యూనిట్ల వి ద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచిత విద్యుత్, విద్యా భరోసా కింద 5 లక్షల రూపాయలు విద్యార్థులకు, నెలకు 4వేల రూపాయల నెలసరి పెన్షన్‌ను ఇవ్వబోతున్నామన్నారు. 10 లక్షలతో రాజీవ్ ఆరోగ్య శ్రీని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. తాము అధికారంలో ఉన్న కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ వంటి రాష్ట్రాలలో సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఈ హామీలను నెరవే ర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంత భారీ సం ఖ్యలో బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలకు, అభిమానులకు ఆయన కృతఙ్ఞతలు తెలుపుతూ తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.