Thursday, January 23, 2025

మంచులో చిన్నారులు.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా!

- Advertisement -
- Advertisement -

మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారన్న సంగతి తెలిసిందే. స్ఫూర్తిదాయకమైన వీడియోలను పోస్ట్ చేస్తూ, వీలైతే తనకు చేతనైనంతగా ఆర్థికసహాయం అందజేస్తూ ఉంటారు. ఆయన పోస్ట్ చేసిన వీడియోలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఆనంద్ మహీంద్రా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో చూడటానికి కవలలు అనిపిస్తున్న ఇద్దరు చిన్నారి ఆడపిల్లలు తమ ఇంటి దగ్గర పడిన మంచు గురించి వర్ణించిన తీరు అబ్బురపరుస్తుంది. మంచు పడిన తీరునూ, ఆ మంచులో తాము ఎంతగా ఎంజాయ్ చేస్తున్నామో లైవ్ లో యాంకరింగ్ చేస్తున్నట్లుగా వారు చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. ‘ఈ మంచు మధ్య నించుంటే మాకు స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. ఇవి పాల గడ్డలు అనుకుంటున్నారా, కాదండీ మంచు గడ్డలు’ అంటూ ముద్దు ముద్దు మాటలతో చెప్పుకుపోయారు. చివరలో కెమెరా వెనక ఉన్న వ్యక్తి ‘మీకు జలుబు చేయదా మరి?’ అని అడిగితే ‘చేస్తుంది. కానీ మేం ఎంజాయ్ కూడా చేయాలి కదా’ అంటూ తడుముకోకుండా చెప్పారు ఆ చిన్నారులు! ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ వీడియోను మీరు కూడా చూసేయండి మరి!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News