Monday, December 23, 2024

పిల్లలను చదువుతోపాటు ఆటల్లో కూడా ప్రొత్సహించాలి

- Advertisement -
- Advertisement -
  • ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
  • గోల్డ్ మెడల్ సాధించిన రమేష్ చంద్రను అభినందించిన ప్రభుత్వ విప్

మన్ననూర్: సిద్ధిపేటలో ఈ నెల 6వ తేదిన జరిగిన మారథాన్ రన్‌లో అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన రమేష్ చంద్ర పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం శుభపరిణామమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు అన్నారు. అదే విధంగా మహిళా విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన నవ్యకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మెడల్స్ సాధించిన రమేష్ చంద్ర, నవ్యలు బుధవారం హైదరాబాద్‌లోని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ గువ్వల బాలరాజు నివాసంలో మర్యాపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రమేష్ చంద్ర అచ్చంపేట ప్రాంతానికి సంబంధించిన యువకుడు కావడం, ఎక్కడ పోటి చేసిన మొదటి బహుమతి సాధించడం అనేది పరిపాటుగా మారిందని అచ్చంపేట ప్రజలంతా కూడా తమ పిల్లలను చదువులోనే కాకుండా ఆటలలో ప్రొత్సహించాలని సూచించారు. క్రీడల్లో మాత్రమే పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News