హైదరాబాద్: మిషన్ ఇంధ్ర ధనుష్ కార్యక్రమంలో భాగంగా సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో వ్యాధి నిరోధక టీకాలు తీసుకొని, మధ్యలో వదిలివేసిన 0-2 సంవత్సరాల పిల్లలందరికి తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలను ఇప్పించాలని జిల్లా కలెక్టర్ శ్వేతా మహాంతి కోరారు. మిషన్ ఇంధ్ర ధనుష్ జిల్లాలో మంగళవారం అసిఫ్‌నగర్ మండలంలోని ఆఫ్జల్‌సాగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఇందిరానగర్, నట్రాజ్‌నగర్ అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వ్యాధి నిరోధక టీకాల పంపిణీ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆరోగ్యశాఖ, అంగన్‌వాడీ రికార్డులను తనిఖీ చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శశికళ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి. డా.వెంకటి, డిఐఓ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమాధికారి ఆకేశ్వరరావు, డిపిఆర్‌ఓ భానుప్రసాద్, ఎస్పీహెచ్‌ఓ డా. నరేంద్రబాటు, వైద్యాధికారి తజీమ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
- Advertisement -