Wednesday, January 22, 2025

పాపం పసివాళ్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ చిన్నపాటి విమానం బయలుదేరిన కొద్ది గంటల్లో ప్రమాదానికి గురైన సంఘటన దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మే 1 న చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో నలుగురు చిన్నారులు అడవిలో తప్పిపోయారు. వివరాలలోకి వెళితే.. అమెజాన్ అటవీ ప్రాంతంలోని ఆరారాక్యూరా నుంచి శాన్ జోస్ డెల్ గ్వావియారే ప్రాంతానికి మే 1న ఏడుగురు ప్రయాణికులతో చిన్న విమానం బయలు దేరింది. బయలు దేరిన కొద్ది గంటల్లోనే విమానంలోని ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం అడవిలో కుప్పకూలిపోయింది.

దీంతో అప్రమత్రమైన అధికారులు కూలిన విమానం ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలో భాగంగా రిస్క్యూ టీం విమాన శకలాలను, ముగ్గురి మృతదేహాలను గుర్తించారు. ఫ్రమాద సమయంలో విమానంలో నలుగురు చిన్నారులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నలుగురి చిన్నారుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. నెల రోజులు గడుస్తున్న ఇంకా చిన్నారుల ఆచూకి లభ్యం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News