Monday, December 23, 2024

మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు

- Advertisement -
న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. రక్షా బంధన్ ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరంద్రమోడీకి చిన్నారులు రాఖీ కట్టారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి రక్షా బంధన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలికలతో ప్రధాని మోడీ  ప్రత్యేకంగా మాట్లాడారు.. వారితో కలిసి సరదాగా పండుగను జరుపుకున్నారు. ప్రధాని మోడీకి చిన్నారులు రంగు రంగుల రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. రాఖీ వేడుకలకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను ఎక్స్ లో షేర్ చేశారు.. తన యువ స్నేహితులతో కలిసి రక్షా బంధన్‌ని జరుపుకున్నందుకు సంతోషంగా ఉందంటూ.. ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
- Advertisement -

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News