Sunday, December 22, 2024

చిన్నారుల వేసవి క్రీడా శిక్షణకు అంతా సిద్దం

- Advertisement -
- Advertisement -

25న నుంచి ప్రారంభం
రోజుల పాటు 44 క్రీడాల్లో శిక్షణ
కోట్ల విలువైన స్పోర్ట్ కిట్స్ సిద్దం
మంది కోచ్ లతో శిక్షఱ
25 నుండి ప్రారంభం మే 31తో ముగింపు

Children training sports in Summer

మన తెలంగాణ/సిటీ బ్యూరో: వేసవి కాలంలో పిల్లలకు మానసిక ఉల్లాసం, క్రీడల ఆసక్తితో పాటుగా వివిధ క్రీడల పట్ల నైపుణ్యత పెంపొందించేందుకు జిహెచ్‌ఎంసి కృషి చేస్తున్నది. ఈ ఏడాది ‘ క్యాచ్ ఏమ్ యంగ్ ’ అనే స్ఫూర్తితో 6 ఏళ్ల నుంచి 16 ఏళ్ల బాల బాలికలకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ లను జిహెచ్‌ఎంసి నిర్వహిస్తున్నది. ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఈనెల 25వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడలను జోనల్ వారీగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రారంభోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రీదా శిబిరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటుగా మంత్రులు, శాసన సభ్యులు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేటర్లు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు. మొత్తం 41 రోజులు పాటు వివిధ క్రీడాల్లో శిక్షణ శిబిరం మే 31వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందుకు సంబంధించి నగర వ్యాప్తంగా ఉన్న క్రీడా మైదానాలలో క్రీడా ప్రాంగణంలో క్రీడా శిక్షణ తరగతులకు జిహెచ్‌ఎంసి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సాంప్రదాయ, ఆధునాతన మొత్తం 44 క్రీడలలో 854 ప్లే గ్రౌండ్ లలో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణల్లో పాల్గొనే ఆసక్తి గల వారు జిహెచ్‌ఎంసి www.sports.ghmc.gov.in పోర్టల్ లో నమోదు చేసుకోవాలి. ఇందుకు సంబంధించి నామ మాత్రపు రుసుం చెల్లించవలసి ఉంటుంది. షటిల్, బ్యాడ్మింటన్, రోలర్ స్కేటింగ్, క్రికెట్, టెన్నిస్ క్రీడ లకు రూ. 50, మిగతా క్రీడలకు రూ.10లను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం శిక్షణ శిబిరాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది వేసవిలో క్రీడల నిర్వహణకు క్రీడా మైదానాలలో, ప్రాంగణాల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు.

44 క్రీడల్లో -శిక్షణ:

ఈ ఏడాది మొత్తం సాంప్రదాయక, ఆధునాతన క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా అథ్లెటిక్స్, ఆర్య పత్య, అర్చెరీ, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, చెస్, సైక్లింగ్, ఫెన్సింగ్, ఫుట్ బాల్, జిమ్నాస్టిక్స్, హాకీ, హ్యాండ్ బాల్, జూడో, కరాటే, కబడ్డీ, ఖో ఖో, కోర్ట్ బాల్, మాల్కంబ, నెట్ బాల్, రోలర్ స్కేటింగ్, సాఫ్ట్ బాల్, స్విమ్మింగ్, సేపక్ టాక్ర, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, టెన్నికాయిట్, తైక్వాండో, టంగ్ అఫ్ వార్, వాలీ బాల్, వెయిట్ లిఫ్టింగ్, ఇండియన్ రెజ్లింగ్, రోమన్ రెజ్లింగ్, వుషు, యోగ, బీచ్ వాలీ బాల్, త్రో బాల్, కిక్ బాక్సింగ్, ముఅయ్ థాయ్,స్క్వే మార్షల్ ఆరట్స్, మినీ ఫుట్ బాల్ తదితర మొత్తం 44 ఆటల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

జోన్ల వారిగా ప్రారంభోత్సవాలు:

వేసవి క్రీడా శిబిరాలను జోన్ల వారిగా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ జోన్ లో ఈ నెల 25వ తేదీన ఉదయం 7 గంటలకు విక్టరీ ప్లే గ్రౌండ్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభిస్తారు. చార్మినార్ జోన్ లో 26వ తేదీన సాయంత్రం 4 గంటలకు కులీ కుతుబ్ షా స్టేడియం, 27వ తేదీన ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ జోన్ లో మారెడ్ పల్లి ప్లే గ్రౌండ్ లో కూకట్ పల్లి, శేరీలింగం పల్లి జోనల్ పరిధిలో పిజేఆర్ చందానగర్ స్పోరట్స్ కాంప్లెక్స్, సాయంత్రం 4 గంటలకు, ఎల్బి నగర్ జోన్లో ఉప్పల్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు మేయర్ తో పాటు సంబంధిత ప్రజా ప్రతినిధులతో కలిసి వేసవి క్రీడా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదే విధంగా ముగింపు సమావేశంలో కూడా మేయర్ పాల్గొని ప్రశంస పత్రాలు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్న వారికి అందజేయనున్నారు.

రూ. 1.20 కోట్ల విలువ గల స్పోర్ట్ కిట్స్:

వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఈ ఏడాది రూ.1.20 కోట్ల విలువైన స్పోర్ట్ కిట్లను అధికారులు సిద్దం చేశారు. గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించలేకపోవడంతో ఈ ఏడాది చిన్నారులు భారీ సంఖ్యలో పాల్గొంటారనే ఉద్దేశంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇందుకు సంబంధించి 44 క్రీడాల్లో శిక్షణ ఇచ్చేందుకు అనుభవజ్ఞులైన కోచ్ లు సీనియర్ క్రీడాకారులు 800 మంది ని సిద్ధం చేశారు. వీరికి ఎలాంటి పారితోషికం చెల్లించబడదు. ఈ నేపథ్యంలో సర్కిల్ వారీగా ఇంటర్ సర్కిల్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ క్రీడ శిబిరంలో పాల్గొన్నవారిలో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వారికి జిఎంహెచ్‌ఎంసి అధ్వర్యంలో రెగ్యులర్ గా ఆసక్తి ఉన్న క్రీడలలో పూర్తిగా శిక్షణ కల్పించి వారిని, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే టోర్నమెంట్ లో పాల్గొనే విధంగా సిద్దం చేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News